ఆనందం

ఏప్రిల్ J, 2010

ఆనందం

మనసంతా ఆనందం

ఎందుకో తెలియదు

ఏమిటో తెలియదు

ఆనందం

వర్షం ఇంకా మొదలవ్వలేదు

వాతావరణం నాకు తగలట్లేదు

తను గుర్తురానే లేదు

అయినా ఆనందమే

తెలుగు పాట వలనో తెలియదు

మన మాట వలనో తెలియదు

ఎందుకో తెలియదు

ఏమిటో తెలియదు

ఊపిరి తిత్తులకు గాలి కూడా చేరట్లేదు

అంత ఆనందం

ఇందులో స్వార్ధం లేదు

ఉత్తి ఆనందం

ఆనందం

అని జపించిన ప్రతీ సారి

మరింత ఆనందం

దీనికి అంతమూ లేదేమో

ఏమో

ఆనందం